అనంతపురం లో బస్సు ఎక్కబోయి కిందపడ్డ ఉపాధ్యాయురాలు

12చూసినవారు
అనంతపురం లో బస్సు ఎక్కబోయి కిందపడ్డ ఉపాధ్యాయురాలు
అనంతపురం ఆర్టీసీ బస్టాండ్లో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. గుత్తికి చెందిన ప్రైవేట్ కాలేజీ అధ్యాపకురాలు పద్మావతి, తన కుమార్తె పింకీతో కలిసి అనంతపురం వెళ్లారు. తిరిగి గుత్తికి వెళ్లేందుకు మధ్యాహ్నం రెండు గంటలకు బస్టాండ్కు చేరుకున్నారు. బస్సులు ఆలస్యం కావడంతో వేచి చూస్తుండగా, వచ్చిన బస్సు ఎక్కేందుకు ప్రయత్నించినప్పుడు పద్మావతి జారి కిందపడి గాయపడ్డారు.