రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతాంగం రోడ్డుపై నిలబడే పరిస్థితి తెచ్చిందని వైఎస్ఆర్సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. మంగళవారం వైసీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు సీఎం అయ్యాక 18 నెలల నుంచి ఏ పంటకూ మద్దతు ధర కల్పించలేదని మండిపడ్డారు. అనంతపురం జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా కూటమి పాలనలో రైతులు అష్టకష్టాలు పడుతున్నారని, విత్తనం నుంచి ఎరువులు, పంట విక్రయం వరకు రైతాంగం రోడ్డెక్కే పరిస్థితులు తెచ్చారని విమర్శించారు.