శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా పని చేయాలి

11చూసినవారు
శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా పని చేయాలి
అనంతపురం నగరంలో శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా పని చేయాలని 2వ పట్టణ సీఐ పుల్లయ్య, 4వ పట్టణ ఎస్ఐ గోపిలకు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ సూచించారు. నగరంలో శాంతియుత వాతావరణం ఉండాలని, తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. రాజీ లేకుండా ముందుకు వెళ్లాలని, తమ వైపు నుంచి పూర్తి సహకారం ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు. ఇటీవల బాధ్యతలు చేపట్టిన సీఐ, ఎస్ఐలు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి, రెండు స్టేషన్ల పరిధిలోని సమస్యలపై చర్చించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్