కొంకొండ్లలోని వింత వేంకటేశ్వరుడు: శివలింగంగా భ్రమించే విగ్రహం

6చూసినవారు
కొంకొండ్లలోని వింత వేంకటేశ్వరుడు: శివలింగంగా భ్రమించే విగ్రహం
అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం కొంకొండ్లలోని ఉరవకొండ-గుంతకల్లు ప్రధాన రహదారి అంచున పెద్ద రాతి బండరాలు ఉన్నాయి. వాటిపై స్వర్ణకాంతితో చిన్నపాటి గోపురం ఉండగా, బండరాల కింద ఒక గవిలో విగ్రహం ఉంది.   చూడగానే శివలింగం అనిపించినా, దగ్గరికి వెళ్లి పరిశీలిస్తే వేంకటేశ్వరుడి రూపంగా కనిపిస్తుంది. కొన్నేళ్ల క్రితం ఓ భక్తుడు స్వామి మూలవిగ్రహానికి నాగాభరణాన్ని విరాళంగా ఇచ్చాడు. అర్చకులు విగ్రహాన్ని ఆభరణంతో అలంకరించి పూజలు ప్రారంభించారు. కొత్తగా వచ్చే భక్తులు తొలుత శివలింగం అనుకుంటారు. ఇక్కడ మహాశివరాత్రి పెద్ద జాతర నిర్వహించబడుతుంది, ఉగాది, వైకుంఠ ఏకాదశి సందర్భంగా కూడా ప్రత్యేక ఉత్సవాలు జరుగుతాయి.
Job Suitcase

Jobs near you