అనంతపురం జిల్లాలో పెట్రోల్, డీజిల్ నిల్వలపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ ఆనంద్ స్పష్టం చేశారు. అనంతపురం కలెక్టరేట్లో డీజిల్, పెట్రోల్ సరఫరా, ప్రస్తుత పరిస్థితులపై ఆయన మాట్లాడుతూ, జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత ఏమాత్రం లేదని, తగినన్ని నిల్వలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. డీజిల్ రోజువారీ సగటు విక్రయాలు 383 కిలోలీటర్ల నుంచి 611 కిలోలీటర్లకు పెరిగాయని ఆయన పేర్కొన్నారు.