అనంతపురం యూనివర్సిటీలో చెట్లు దగ్ధం

6చూసినవారు
అనంతపురం యూనివర్సిటీలో చెట్లు దగ్ధం
అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ క్వార్టర్స్‌లో ఆకతాయిలు నిప్పు పెట్టడంతో పదేళ్ల క్రితం నాటిన వెయ్యికి పైగా రావి, వేప తదితర చెట్లు కాలిపోయాయి. యూనివర్సిటీ అధికారులు అక్కడ ఉన్న గడ్డిని తొలగించి ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటనపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.