అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం నంజాపూరం గ్రామానికి చెందిన కవిత, రమేశ్ దంపతులకు ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు జన్మించారు. ఇప్పటికే నలుగురు ఆడపిల్లలు ఉన్న వీరికి, తాజా ప్రసవంలో ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె కలిగారు. అనంతపురం సర్వజన వైద్యశాల వైద్యులు కవితకు సిజేరియన్ ద్వారా ముగ్గురిని సురక్షితంగా బయటకు తీశారు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డా. మల్లీశ్వరి వెల్లడించారు. ఈ అరుదైన ఘటన వైద్యులను, స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది.