అనంతపురం జిల్లా గుంతకల్లులో మంగళవారం 2.5 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ శ్రీ పి. జగదీష్ IPS ఆదేశాల మేరకు, గుంతకల్లు ఒన్ టౌన్ పోలీసులు గంజాయి విక్రేతలపై నిఘా ఉంచారు. ఈ క్రమంలో, గంగానగర్ ప్రాంతానికి చెందిన యాసర్ అలీ @ యాశర్ అలీ హాజీ ఉజ్జీత్ అలీ (54) మరియు షేక్ మొహమ్మద్ (39) అనే ఇద్దరు గంజాయి విక్రేతలను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 2.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.