అనంతపురం జిల్లాకు చెందిన ఇద్దరు తహశీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి లభించింది. ఏ. హరికుమార్, పి. విజయకుమారికి పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హరికుమార్ రాయదుర్గంలో, విజయకుమారి రాప్తాడులో విధులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం కొత్త పోస్టింగ్ ఇచ్చేంతవరకు వీరు తమ ప్రస్తుత స్థానాల్లోనే కొనసాగాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.