అనంతపురంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి డంపింగ్ యార్డులో తెగి ఉన్న మానవ చేయి కనిపించడంతో స్థానికులు, ఆసుపత్రి సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ఈ చేయి ఎలా అక్కడికి చేరిందనే దానిపై పోలీసులు విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.