ఆసియా కప్ ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై భారత్ సాధించిన అద్భుత విజయంతో అనంతపురంలో సంబరాలు అంబరాన్ని తాకాయి. అర్ధరాత్రి క్రికెట్ ప్రేమికులు టవర్ క్లాక్ వద్దకు చేరుకుని, టపాసులు పేలుస్తూ, జాతీయ జెండాలు చేతపట్టి పుర వీధుల్లో తిరుగుతూ సందడి చేశారు. ముఖ్యంగా, 'తిలక్ వర్మ, నువ్వొక హీరో' అంటూ తెలుగు ఆటగాడు తిలక్ వర్మపై ప్రశంసలు కురిపించారు.