రిజర్వేషన్ల పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు పోతుల నాగరాజు, జిల్లా స్థాయి ప్రభుత్వ పోస్టుల కేటాయింపులో కులం, అవినీతికి ప్రాధాన్యం పెరుగుతోందని ఆరోపించారు. అర్హత, సీనియార్టీ ఉన్నవారికి అన్యాయం జరుగుతోందని, అనంతపురం జిల్లాలో ఒకే వ్యక్తికి రెండు కీలక పోస్టులు ఇవ్వడం, సీనియర్ అధికారులను పక్కన పెట్టడం వల్ల ఉద్యోగుల్లో అసంతృప్తి పెరిగిందని తెలిపారు. ప్రతిభ, సీనియార్టీ, నిజాయితీ ఆధారంగా పోస్టులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.