అనంతపురం నగరంలోని 4వ డివిజన్, రూరల్ పంచాయతీలోని సుశీలరెడ్డి నగర్ లలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పింఛన్లను ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రజా స్పందనను తెలుసుకున్నారు. వెయ్యి రూపాయలు పింఛన్ పెంచడానికి జగన్ రెడ్డికి ఐదేళ్లు పట్టిందని, అయితే అధికారంలోకి రాగానే ఒక్క మాటతో పెంచారని ఎమ్మెల్యే తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అన్ని వర్గాల వారికి పింఛన్లు పెంచారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అంబిక, అధ్యక్షుడు పూల నాగరాజు కూడా పాల్గొన్నారు.