మహిళల సాధికారతే లక్ష్యం;డీఎస్పీ

3చూసినవారు
మహిళల సాధికారతే లక్ష్యం;డీఎస్పీ
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని అనంతపురం జిల్లా వ్యాప్తంగా పోలీసుశాఖ నిర్వహిస్తున్న వారోత్సవాల్లో భాగంగా, జిల్లా ఎస్పీ శ్రీ పి. జగదీష్ IPS గారి ఆదేశాల మేరకు అనంతపురం మహిళా పోలీస్ విభాగం ఆధ్వర్యంలో స్థానిక చర్చ్ స్కూల్‌లో విద్యార్థులకు వ్యాసరచన, తదితర పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మహిళా విభాగం డీఎస్పీ మహబూబ్ బాషా ఆధ్వర్యంలో చేపట్టారు. విద్యార్థుల్లో మహిళల పట్ల గౌరవ భావన, సమానత్వ దృక్పథం, చట్టపరమైన అవగాహన పెంపొందించడం ప్రధాన లక్ష్యంగా ఈ పోటీలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్