
బ్రిలియంట్ స్కూల్ లో MEO ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని శివానగర్ లో గల బ్రిలియంట్ స్కూల్ లో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఆగస్టు 15న ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ధర్మవరం MEO 1 రాజేశ్వరి విచ్చేసి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా MEO విద్యార్థులకు విలువైన సందేశం ఇస్తూ వారు మొబైల్ ఫోన్లు, డ్రగ్స్ వంటి వాటికి దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ C. V. శేషు కూడా విద్యార్థులకు మంచి సందేశం అందించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.






































