ధర్మవరంలోని రెండు మద్యం బార్లకు లైసెన్స్ జారీ చేయనున్నట్లు ఎక్సైజ్ సీఐ చంద్రమణి తెలిపారు. ఫిబ్రవరి 5 నుంచి ఆగస్టు 31, 2028 వరకు లైసెన్స్ పొందడానికి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ నెల 28వ తేదీ నుంచి ఫిబ్రవరి 4వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. దరఖాస్తుదారులు ఆన్లైన్, హైబ్రిడ్, ఆఫ్లైన్ పద్ధతుల్లో దరఖాస్తు చేసుకోవచ్చు.