అనంతపురం లోని అశోక్ నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన సౌత్ ఇండియా లెవెల్ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ 2026 లో, కటాస్ విభాగంలో ధర్మవరం బ్రిలియంట్ ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. B. V. శ్రీ విగ్నేష్ మొదటి బహుమతిని, B. శివ సాయి రెండవ బహుమతిని సాధించారు. వీరిని పాఠశాల కరెస్పాండెంట్ C. V. శేషు, కరాటే మాస్టర్ రమేష్ ప్రత్యేకంగా అభినందించారు.