ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల సౌకర్యార్థం పట్టణానికి చెందిన సికిందర్ అనే వ్యక్తి మూడు కూలర్లను విరాళంగా అందించారు. బుధవారం ధర్మవరం బీజేపీ నేత హరీష్ బాబు సమక్షంలో ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ తిప్పేంద్ర నాయక్ ఈ కూలర్లను స్వీకరించారు. ఎండ వేడిమికి రోగులు ఇబ్బంది పడకుండా సేవా దృక్పథంతో ఈ సహాయం చేసినట్లు సికిందర్ తెలిపారు. ఆయన సేవను పలువురు అభినందించారు.