మంత్రి సత్యకుమార్ యాదవ్ సూచనల మేరకు, శనివారం 22వ వార్డ్ సాయినగర్ లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరిగింది. సచివాలయ సిబ్బందితో కలిసి అర్హులైన లబ్ధిదారులకు వారి ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్లు అందించారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు ఓంప్రకాష్ గౌడ్, బీజేపి నాయకులు పూజారి నరసింహులు, వార్డ్ బీజేపీ నాయకులు కృష్ణ రావు పాల్గొన్నారు.