ధర్మవరం: దారుణం.. గర్భం దాల్చిన 14 ఏళ్ల బాలిక

3చూసినవారు
ధర్మవరం: దారుణం.. గర్భం దాల్చిన 14 ఏళ్ల బాలిక
సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో 14 ఏళ్ల బాలికను ఆమె పెంపుడు తండ్రి, అతని బావమరిది కొన్ని నెలలుగా అత్యాచారానికి పాల్పడడంతో ఆమె గర్భం దాల్చింది. తిరుపతి జిల్లాకు చెందిన ఆ బాలికను 14 ఏళ్ల క్రితం తీసుకొచ్చి పెంచుకుంటున్నారు. ఆదివారం బాలిక అస్వస్థతకు గురి కావడంతో పెంపుడు తల్లి ఆసుపత్రికి తీసుకెళ్లగా ఐదు నెలల గర్భం ఉందని వైద్యులు చెప్పడంతో తన సోదరుడే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని భావించి పెంపుడు తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం పోలీసుల విచారణలో బాలిక ఇద్దరి పేర్లు చెప్పగా ప్రస్తుతం ఇద్దరు పరారీలో ఉన్నారు.

సంబంధిత పోస్ట్