ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ఫామ్ హౌస్ (గుర్రాల కోట) వద్ద ఉన్న ఎర్రగుట్ట కొండలో మంగళవారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. ఫామ్ హౌస్‌కు సుమారు 150 మీటర్ల దూరంలో జరిగిన ఈ ప్రమాదానికి విద్యుత్ వైర్ సర్క్యూట్ కారణమని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.