ధర్మవరం పట్టణంలో శనివారం సాయంత్రం నుంచి గాలులతో కూడిన వర్షం ప్రారంభమైంది. గాలి తీవ్రత కారణంగా అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. రెండు రోజులుగా ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు ఈ మారిన వాతావరణం కొంత ఉపశమనం కలిగించింది. రాబోయే రెండు రోజులు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.