ధర్మవరం పట్టణానికి చెందిన ప్రముఖ చేనేత డిజైనర్ జుజారే నాగరాజు, కేంద్ర చేనేత జౌళి శాఖ మంత్రి గిరిరాజు సింగ్ కు శుక్రవారం విజయవాడలోని నోవాటెల్ హోటల్లో జరిగిన జాతీయ చేనేత ప్రముఖుల సమావేశంలో పట్టు వస్త్రాన్ని బహుకరించారు. ఈ సందర్భంగా నాగరాజు కేంద్రమంత్రికి పట్టుచీరల విశిష్టత, కార్మికుల నైపుణ్యం గురించి వివరించారు. అనంతరం ధర్మవరం చేనేత ప్రత్యేకతలను తెలియజేశారు.