సాఫ్ట్ బాల్ పోటీల్లో ధర్మవరం విద్యార్థి ప్రతిభ

9చూసినవారు
సాఫ్ట్ బాల్ పోటీల్లో ధర్మవరం విద్యార్థి ప్రతిభ
ధర్మవరం పట్టణంలోని కే హెచ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన కే. ధనుష్ ఆల్ ఇండియా సాఫ్ట్ బాల్ పోటీలకు ఎంపికయ్యాడు. ఫిజికల్ డైరెక్టర్ బి. ఆనంద్ తెలిపిన వివరాల ప్రకారం, గత డిసెంబర్లో ఎస్కే యూనివర్సిటీలో జరిగిన సెలక్షన్స్లో ధనుష్ ఉత్తమ ప్రతిభ కనబరచి యూనివర్సిటీ జట్టుకు ఎంపికయ్యాడు. ఫిబ్రవరి 1 నుంచి మహారాష్ట్రలో జరగనున్న ఆల్ ఇండియా పోటీల్లో ధనుష్ యూనివర్సిటీ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నాడు.

ట్యాగ్స్ :