ధర్మవరం పట్టణానికి చెందిన బి. నీఖ్యశ్రీ, ఎం. యశస్విని, వైష్ణవి, అలేఖ్య రాష్ట్రస్థాయి బాస్కెట్బాల్ పోటీలకు ఎంపికయ్యారు. అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ శెట్టిపి జయచంద్రారెడ్డి ఈ విషయాన్ని తెలిపారు. ఈ నెల 7 నుంచి 10వ తేదీ వరకు విశాఖపట్నంలో జరిగే 11వ ఆంధ్రప్రదేశ్ సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ పోటీల్లో వీరు పాల్గొంటారు. రాష్ట్రస్థాయిలో రాణించి ధర్మవరానికి కీర్తి తీసుకురావాలని ఆకాంక్షించారు.