ధర్మవరం పట్టణంలో మంగళవారం కదిరి గేటు సమీపంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి రైలు కింద పడి మృతి చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మృతుడి వయసు సుమారు 20 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉంటుందని, మృతదేహం రైల్వే స్టేషన్ నుండి కదిరి గేటుకు వెళ్లే రోడ్డు రైలు పట్టాల పక్కన లభ్యమైందని పేర్కొన్నారు. మృతుడికి సంబంధించిన వారు రైల్వే పోలీసులను సంప్రదించాలని సూచించారు.