ధర్మవరంలో అంబటి రాంబాబు దిష్టిబొమ్మ దగ్ధం

5చూసినవారు
ధర్మవరం పట్టణంలో వైకాపా నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు దిష్టిబొమ్మను శనివారం తెలుగుదేశం పార్టీ నాయకులు దగ్ధం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈ నిరసన చేపట్టారు. అనంతరం, టీడీపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షుడు సుధాకర్, సీనియర్ నాయకులు కమతం కాటమయ్యతో పాటు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్