ధర్మవరం 34వ వార్డు రాజేంద్రనగర్‌లో కొద్దిరోజులుగా విద్యుత్ సమస్యలతో చేనేత కార్మికులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా టీడీపీ విభిన్న ప్రతిభావంతుల అధ్యక్షుడు నాగూర్ ఉమర్, టీడీపీ ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్ దృష్టికి తీసుకెళ్లారు. శ్రీరామ్ స్పందించి అధికారులతో మాట్లాడి, విరిగిపోయిన కరెంటు స్తంభాల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయించారు. దీనితో ప్రజలు, కార్మికులు ఉపశమనం పొందారు.