ముదిగుబ్బలో లారీ ఢీకొని రైతు మృతి

70చూసినవారు
ముదిగుబ్బ మండలం పోడారాళ్లపల్లి బస్ స్టాప్ సమీపాన ఆదివారం సిమెంట్ లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ఈ ఘటనలో రామస్వామి నాయక్ తండాకు చెందిన శీను నాయక్ అను గిరిజన రైతు అక్కడికక్కడే మృతి చెందాడు. శీను నాయక్ తన ద్విచక్ర వాహనంపై ముదిగుబ్బ వస్తుండగా ఎదురుగా వస్తున్న సిమెంట్ లారీ ఢీకొన్నట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్