ధర్మవరం సంక్రాంతి వేడుకలకు సినీ నటులు సాయికుమార్, గజల్ శ్రీనివాస్ హాజరవుతున్నట్లు బీజేపీ నేత హరీశ్ బాబు తెలిపారు. ఈ నెల 14, 15 తేదీల్లో స్థానిక కళాశాల మైదానంలో సంబరాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ వేడుకలకు రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ సైతం రానున్నారని పేర్కొన్నారు. పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని పండుగ వేడుకలను జయప్రదం చేయాలని ఆయన కోరారు.