ధర్మవరం పోతుకుంట నూతన ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం ఉచిత వినికిడి పరీక్షల కార్యక్రమం ముగిశాయి. బీజేపీ నేత హరీశ్ మాట్లాడుతూ సంస్కృతి సేవా సమితి, దీన్ దయాల్ శ్రవణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ చొరవతో వినికిడి లోపం ఉన్నవారి కోసం ఉచిత వినికిడి పరీక్షలు చేశారని అన్నారు. 2177 మందిని పరీక్షించగా, 1579 మందికి వినికిడి యంత్రాలను ఒక నెల తర్వాత ఉచితంగా అందజేస్తామన్నారు.