ధర్మవరం పట్టణంలో తరచుగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించడానికి స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని అఖిల భారత యువజన సమాఖ్య జిల్లా కార్యదర్శి సకల రాజా కోరారు. ఈ మేరకు సోమవారం ఆర్డిఓ కార్యాలయం అధికారిని కలిసి వినతి పత్రం అందజేశారు. పట్టణంలో ప్రమాదాలు జరగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.