రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యక్తిగత అంశాలను తమ పార్టీకి ఆపాదించడం సరికాదని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి అన్నారు. బుధవారం ధర్మవరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, అరవ శ్రీధర్ వ్యవహారంపై పార్టీ నియమించిన త్రిసభ్య కమిటీ విచారణ చేస్తోందని తెలిపారు. జనసేనకు చెడ్డపేరు తెచ్చే వారిని ఎంతటివారినైనా పార్టీ పక్కనపెట్టేందుకు వెనుకాడదని ఆయన స్పష్టం చేశారు.