ధర్మవరం పట్టణంలో రాష్ట్ర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకుని పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా వేడుకలు నిర్వహించారు. పట్టణంలోని అన్నా క్యాంటీన్ వద్ద కేక్ కట్ చేసి, పేదలకు భోజనం వడ్డించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు అడ్డగిరి శ్యామ్, రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.