ధర్మవరం పట్టణంలోని సీతారామయ్య బాలికల జూనియర్ కళాశాలలో రేపు ఆదివారం జనవిజ్ఞాన వేదిక శ్రీ సత్య సాయి జిల్లా కమిటీ సమావేశం జరగనుంది. ఈ విషయాన్ని శనివారం జిల్లా అధ్యక్షుడు నరసారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి వి. లోకేష్ తెలిపారు. సమావేశంలో గత కార్యక్రమాల సమీక్ష, చెకుముకి టాలెంట్ టెస్ట్, నవంబర్ 26 నుంచి జరగనున్న రాజ్యాంగ ప్రచార కార్యక్రమంపై చర్చించనున్నారు.