ధర్మవరం పట్టణం నుండి ఎర్రగుంట వెళ్లే రోడ్డుపై శుక్రవారం లారీ ద్విచక్ర వాహనదారుడిని వెనుక నుండి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సికేపల్లి మండలం మేడాపురానికి చెందిన కొండన్న అనే వృద్ధుడు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు అతన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.