ధర్మవరం టౌన్ టీచర్స్ కాలనీలో శనివారం చంద్రశేఖర్ (42) అనే వ్యక్తి అప్పుల బాధతో ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం, అప్పుల భారం భరించలేక అతను ఈ దారుణానికి పాల్పడ్డాడు. చంద్రశేఖర్‌కు భార్య శశికళతో పాటు ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.