చెన్నకేశవ స్వామి వ్రత మండపం ప్రారంభించిన మంత్రి

698చూసినవారు
చెన్నకేశవ స్వామి వ్రత మండపం ప్రారంభించిన మంత్రి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య మరియు ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ బుధవారం ధర్మవరం పట్టణంలోని శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో వ్రత మండపాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వామివారికి వస్ర్తాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి, ప్రజలు సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట ఆలయ అధికారులు, అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.