ధర్మవరం ఎమ్మెల్యే, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ఆదివారం వైజాగ్ లో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైజాగ్ ఎంపీ శ్రీ భరత్, స్థానిక బిజెపి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కూడా పాల్గొన్నారు. ఐదు సంవత్సరాలు లోపల ఉన్న చిన్నారులందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు మంత్రి సూచించారు.