ముదిగుబ్బ పట్టణంలో మంగళవారం ప్రభుత్వ ఉపాధ్యాయురాలు వరలక్ష్మి అనారోగ్యంతో మృతి చెందారు. ఏడు నెలల క్రితం ఆమె భర్త శ్రీనివాసులు గుండెపోటుతో మరణించారు. తల్లిదండ్రులిద్దరూ మరణించడంతో వారి పిల్లలు అనాధలయ్యారు. ఈ విషాదకర సంఘటన స్థానికులను కంటతడి పెట్టించింది.