సీఎంపై అంబటి వ్యాఖ్యలను ఖండించిన ముదిగుబ్బ ఐటీడీపీ

4చూసినవారు
సీఎంపై అంబటి వ్యాఖ్యలను ఖండించిన ముదిగుబ్బ ఐటీడీపీ
వైకాపా నేత అంబటి రాంబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై చేసిన వ్యాఖ్యలను ముదిగుబ్బ ఐటీడీపీ ఉపాధ్యక్షుడు తిరుమలేష్ తీవ్రంగా ఖండించారు. రాజకీయ నాయకులు మాట్లాడే ప్రతి మాట హుందాగా ఉండాలని, అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉన్నాయని, ఇలాంటి జుగుప్సాకరమైన మాటలు మాట్లాడే ముందు ఆలోచించుకోవాలని ఆయన అన్నారు. తక్షణమే క్షమాపణలు చెప్పాలని, లేదంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్