ముదిగుబ్బ మండలంలో గత కొన్ని సంవత్సరాలుగా నెలకొన్న చుక్కల భూముల సమస్యలను వెంటనే పరిష్కరించి, రిజిస్ట్రేషన్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని మండల సీపీఐ కార్యదర్శి చల్లా శ్రీనివాసులు డిమాండ్ చేశారు. గురువారం ముదిగుబ్బ తహసీల్దార్ మహేశ్వర్ రెడ్డిని రైతు సంఘం నాయకులు రైతులతో కలిసి వినతి పత్రం అందజేశారు. 1954 సంవత్సరానికి ముందు ఉన్న చుక్కల భూముల సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు.