బుధవారం ముదిగుబ్బ మండలం మంగలమడక వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బుక్కపట్నం మండలం రామ్ సాగరం గ్రామానికి చెందిన శ్రీనివాసులు, డిడి కొట్టాలకు చెందిన షరీఫ్ అనే ఇద్దరు గాయపడ్డారు. స్థానికులు వెంటనే వారిని అంబులెన్స్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.