ఓబుళదేవరచెరువు: హైవేపై రెండు సిమెంట్ లారీలు ఢీ

1461చూసినవారు
ఓబుళదేవరచెరువు: హైవేపై రెండు సిమెంట్ లారీలు ఢీ
శ్రీసత్యసాయి జిల్లా ఓబుళదేవరచెరువు మండలంలోని సుందరయ్య కాలనీ సమీపంలో బుధవారం హైవేపై రెండు సిమెంట్ లారీలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో డ్రైవర్లు మోసిన్, గంగరాజులకు తీవ్ర గాయాలయ్యాయి. లారీ క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన మోసిన్‌ను స్థానికులు, పోలీసులు అతి కష్టం మీద బయటకు తీసి 108 వాహనంలో కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరో డ్రైవర్ గంగరాజును కూడా 108లో కదిరికి తరలించారు.

సంబంధిత పోస్ట్