గురువారం తాడిమర్రి మండలం దాడి తోట భద్రాచలం గ్రామాల్లో ఉపాధి హామీ పనులను ఎంపీడీవో వెంకట రంగారావు సమీక్షించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ప్రస్తుతం ఎండలు ఎక్కువగా ఉన్నందున వడదెబ్బ తగలకుండా కూలీలు తరచూ మంచినీరు తాగుతూ ఉండాలని ఆయన సూచించారు.