ధర్మవరం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ శుక్రవారం మే డే ఉత్సవాల్లో పాల్గొన్నారు. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో జరిగిన ఈ వేడుకల్లో శ్రీరామ్ జెండా ఆవిష్కరించి, కార్మికుల ఎర్ర జెండాను చేతబూని కార్మిక సోదరులకు మద్దతుగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పలు కార్మిక సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.