గుంజే పల్లె కి నీటిని విడుదల చేసిన పరిటాల శ్రీరామ్

9చూసినవారు
గుంజే పల్లె కి నీటిని విడుదల చేసిన పరిటాల శ్రీరామ్
ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ ఛార్జి పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ, 2014కు ముందు జలయజ్ఞం ధనయజ్ఞంగా మారిందని, దానిని ముఖ్యమంత్రి చంద్రబాబు మళ్లీ జలయజ్ఞంగా మార్చారని అన్నారు. బుక్కపట్నం మండలం మారాల రిజర్వాయర్ నుంచి ముదిగుబ్బ మండలం గుంజేపల్లి చెరువుకు నీటిని విడుదల చేశారు. గుంజేపల్లి ప్రాంతంలో తాగునీటి సమస్యతో ప్రజలు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో పరిటాల శ్రీరామ్ చొరవ తీసుకున్నారు. మారాల రిజర్వాయర్లో నీరు సమృద్ధిగా ఉండటంతో పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డిని నీరు విడుదల చేయాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్