సత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు, ధర్మవరం పట్టణంలోని ప్రైవేటు, ప్రభుత్వ బ్యాంకులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇటీవల జిల్లాలో ఏటీఎంలు, బ్యాంకుల్లో చోరీలు పెరగడంతో, అప్రమత్తమైన పోలీసులు బ్యాంకుల్లో ప్రత్యేకంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, వాచ్‌మెన్‌లను నియమించుకోవాలని సూచించారు. ఈ మేరకు వన్ టౌన్ సీఐ రెడ్డప్ప బ్యాంకు అధికారులకు నోటీసులు అందజేశారు.