రాజకీయ పార్టీలు చిత్తశుద్ధితో పోరాడాలి: బీఎస్పీ

0చూసినవారు
రాజకీయ పార్టీలు చిత్తశుద్ధితో పోరాడాలి: బీఎస్పీ
శ్రీసత్యసాయి, ధర్మవరం నియోజకవర్గంలో బీఎస్పీ ధర్మవరం నియోజకవర్గ ఇన్‌చార్జ్ సాకే వినయ్ కుమార్ మాట్లాడుతూ, విద్య, వైద్యం, ఉపాధి, సామాజిక న్యాయం వంటి అంశాలపై అన్ని రాజకీయ పార్టీలు చిత్తశుద్ధితో పోరాడాలని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలను కేవలం ఓటు బ్యాంకులుగా చూడకూడదని అన్నారు. ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైతే ప్రజలే తగిన సమయంలో తగిన తీర్పు ఇస్తారని హెచ్చరించారు. రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణల కంటే పేద ప్రజల విద్య, వైద్య సేవలు, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాల కల్పనపై దృష్టి సారించాలని, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ప్రభుత్వాల ప్రధాన లక్ష్యంగా ఉండాలని సూచించారు.

సంబంధిత పోస్ట్