ధర్మవరం మండలం ఎంపీడీవో ఎం. లలిత సోమవారం మాట్లాడుతూ ధర్మవరం రూరల్ లో సాగునీరు, తాగునీటి కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నామని తెలిపారు. గ్రామాల్లో తాగునీటి ఓవర్ హెడ్ ట్యాంకులను శుభ్రపరిచి, పశువులకు నీటి తొట్టెలు ఏర్పాటు చేయించామని ఆమె పేర్కొన్నారు. ఉపాధి హామీ కూలీలకు వడదెబ్బ తగలకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు కూడా ఎంపీడీవో వివరించారు.